![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -102 లో.....గాయత్రి మెడలో మాధవ తాళి కట్టబోతుంటే తాయారు, పురుషోత్తం వాళ్ళు వచ్చి అడ్డుపడతారు. గాయత్రి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయిందని తాయారు, పురుషోత్తం ఇద్దరు కలిసి యాక్టింగ్ చేస్తూ.. మాధవని పక్కకి తీసుకొని వెళ్తారు. తన కాళ్లపై పడి నా కూతురిని పెళ్లి చేసుకోకని రిక్వెస్ట్ చేస్తారు.నా కుటుంబం పరువుపోతుంది ఇదేనా పెంపకమని అందరు అనుకుంటారు.. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానని పురుషోత్తం బ్లాక్ మెయిల్ చేస్తాడు. దాంతో మాధవ బయటకు వచ్చి గాయత్రి మెడలో తాళి కట్టబోతు ఆగిపోతాడు.
ఆ తర్వాత నీ వాళ్ళని బాధపెట్టి పెళ్లి చేసుకుంటే నువ్వు ఎలా నాతో సుఖంగా ఉంటావ్.. మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదని వచ్చినందుకు వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకోబోయాడు.. పొరపాటుగా ఏదైనా అయితే మహాలక్ష్మి జీవితంతం ఆ నింద భరించలేదు.. ఇప్పుడు మీ వాళ్లకి ఏదైనా అయితే నువ్వు భరించగలవా.. నువ్వు అయినా హ్యాపీగా ఉండే.. వెళ్ళిపో ఇక్కడ నుండి అని మాధవ అంటాడు. ఇక గాయత్రిని వాళ్ళ అమ్మానాన్న తీసుకొని వెళ్తారు. ఏంటి అన్నయ్య నువ్వు చేసిందని చక్రి, కేశవ కోప్పడుతారు. ఇది నా నిర్ణయం నా జీవితం.. ఇక్కడితో ఈ విషయం వదిలెయ్యండి అని మాధవ అంటాడు. మరొకవైపు ఎందుకు ఇలా చేసావని గాయత్రిపై తన పేరెంట్స్ కోప్పడతారు. నా కూతురు అవ్వడం నీ తప్పు ఇంకొకసారి ఇలా చేసి నన్ను చంపకు అమ్మ అని పురుషోత్తం, గాయత్రి కాళ్లపై పడి రిక్వెస్ట్ చేస్తాడు. నువ్వు గనుక రేపు తలవంచుకొని తాళి కట్టించుకోకపోతే నేను చస్తానని తాయారు బ్లాక్ మెయిల్ చేస్తుంది.
మరుసటిరోజు గాయత్రి పెళ్లి బట్టల్లో ఊరేగింపుగా వెళ్తుంటే మాధవ చూసి లోపలికి వచ్చి బాధపడతాడు. కూర్చొని ఏడుస్తుంటే మహా వచ్చి వాటర్ ఇస్తుంది. అవి తీసుకోకుండా తనే వెళ్లి తాగుతాడు. కంగారుగా గ్లాస్ వదిలేస్తాడు. మాధవ దగ్గరికి మహా వచ్చి ఏంటి పెద్ది బాధగా ఉందా అని ఏడుస్తుంది. గాయత్రి ఊరేగింపుగా వెళ్ళింది తన మొహంలో కలనే లేదు.. నేను భయపడి వదిలేయలేదు.. తనకి అమ్మ ఉండాలి.. అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని మాధవ ఎమోషనల్ అవుతాడు. నేనే కావాలని గాయత్రిని మిస్ చేసుకున్నాను.. అది వెళ్లిపోతుంటే చూసిన చూపు గుండెల్లో గుచ్చుకుందని మహా చేతులు పట్టుకొని మాధవ ఏడుస్తాడు. మాధవ ఏడుస్తుంటే మహా కూడా ఏడుస్తుంది. నేను వెళ్లి పడుకుంటానని మాధవ లోపలికి వెళ్లి బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |